బ్లాక్‌మేయిల్ చేసిన వ్యక్తులపై కేసు
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:57 PM
లెక్చరర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో యూఎ్‌సఎ్‌ఫఐ విద్యార్థి నాయకుడితో పాటు ముగ్గురు విలేకరులు, మరో వ్యక్తిపై పోలీసులు కేసునమోదు చేశారు.
పెద్దేముల్, నవంబరు 19: లెక్చరర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో యూఎ్‌సఎ్‌ఫఐ విద్యార్థి నాయకుడితో పాటు ముగ్గురు విలేకరులు, మరో వ్యక్తిపై పోలీసులు కేసునమోదు చేశారు. సీఐ శ్రీనివా్‌సరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ బాలికలను వేధిస్తున్నారనే విషయంలో అతడిపై కేసు నమోదైంది. ఈ విషయమై మీడియాలో, పత్రికల్లో ఆయనపేరు రాయకుండా ఉండేందుకు విద్యార్థి నాయకుడితో పాటు ముగ్గురు విలేకరులు, మరో ఇతరవ్యక్తి రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి రూ.2.50లక్షలు తీసుకున్నారని సీఐ తెలిపారు. ఈకేసులో ఏ1 కింద విద్యార్థి నాయకుడు దీపక్‌రెడ్డి, ఏ5గా ఇమ్రాన్ అనే వ్యక్తిపై మంగళవారం కేసు నమోదు చేసి వారినుంచి రూ.14వేలు నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈకేసులో ఇరత నిందితులుగా నిర్ధారణ అయిన ముగ్గురు విలేకరులపైనా కేసు నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని చెప్పారు. ఈకేసులో ఇంకా ఎంతమందికి ప్రమేయం ఉందనే విషయమై విచారణ జరుపుతున్నట్లు సీఐ వివరించారు.