Caste Census: అధికారుల వద్ద ఉండాల్సిన కులగణన పత్రాలు.. ఎక్కడున్నాయో చూడండి
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:02 PM
Telangana: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్మాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు అంతా కూడా పాలు పంచుకుంటున్నారు. అయితే మేడ్చల్‌లో సమగ్ర సర్వే పత్రాలు రోడ్డుపై కనిపించడం అవాక్కయ్యేలా చేస్తోంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఎన్యుమేటర్ల వద్ద ఉన్న ఫాంలు ...
మేడ్చల్, నవంబర్ 15: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో అధికారుల వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అధికారుల వద్ద ఉండాల్సిన కులగణన దరఖాస్తు ఫారాలు మేడ్చల్ 44వ జాతీయ రహదారిపై పడి ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సర్వే చేస్తున్న దరఖాస్తు ఫాంలు కార్యాలయాల్లో లేదా అధికారుల వద్ద ఉండాల్సినవి రోడ్డుపై ఎలా ఉంటాయని ప్రజలు మండిపడ్డారు.
Rains: బలహీనపడిన అల్పపీడనం.. అయినా తేలికపాటి వర్ష
నిరుపేద ప్రజలకు అందించాల్సిన పథకాలను అమలుపరచాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే విషయంలో చేపట్టే పూర్తి వివరాలు ఎవరికీ తెలియజేయమని భరోసా ఇస్తూనే ఇలా దరఖాస్తు ఫారాలు రోడ్డుపై దర్శనం ఇవ్వడంతో ప్రజల్లో నమ్మకం పోతుందని పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్మాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు అంతా కూడా పాలు పంచుకుంటున్నారు. అయితే మేడ్చల్‌లో సమగ్ర సర్వే పత్రాలు రోడ్డుపై కనిపించడం అవాక్కయ్యేలా చేస్తోంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఎన్యుమేటర్ల వద్ద ఉన్న ఫాంలు రోడ్డుపై దర్శనమిచ్చాయి. అయితే అందులో ఎలాంటి సమాచారం లేదని.. ఖాళీగా ఉన్న ఫాంలు పడి ఉన్నట్లు తెలుస్తోంది. అర కీలోమీటర్ల మేర వందల దరఖాస్తులు రోడ్డుపై అలా పడుండటాన్ని స్థానికులు గుర్తించారు. మేడ్చల్ - నిజామాబాద్ దారిలో ఉన్న రేకుల బావిచౌరస్తా వద్ద ఈ ఫారాలు పడి ఉన్నాయి. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి వచ్చింది. మున్సిపల్ కమిషనర్, తన సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని రోడ్డుపై పడి ఉన్న ఫాంలను తీసుకున్నారు.
Personal Loan vs Overdraft: పర్సనల్ లోన్ vs ఓవర్‌డ్రాఫ్ట్.. వీటిలో ఏది బెస్ట్
అయితే గ్రౌండ్ లెవల్‌లో వ్యతిరేకత వచ్చిన వారు పడేశారా లేక.. జిల్లాలకు తరలించే క్రమంలో పడిపోయాయా, మున్సిపాల్ ఆఫీసు నుంచి ఎన్యుమనరేటర్ దరఖాస్తు ఫాంలను ఎక్కువగా తీసుకుని పడేశారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. దీనిపై ఎన్యుమనేటర్లు, మున్సిపల్ అధికారులతో మున్సిపల్ కమిషనర్ సమావేశమై దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరినట్లు సమాచారం. మొత్తానికి ట్రాన్స్‌పోర్టు చేస్తున్న క్రమంలోనే రోడ్డుపై దరఖాస్తులు పడిపోయాయని అనుమానిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ చెబుతున్న పరిస్థితి. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కమిషనర్ చెప్పారు.
కాగా.. పేద ప్రజల కోసం చేపట్టే సంక్షేమ పథకాలను అమలుపరచే విషయంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సర్వే చేసిన అనంతరం కార్యాలయాల్లో లేదా అధికారుల వద్ద ఉండాల్సిన దరఖాస్తు ఫారాలు జాతీయ రహదారి పక్కన ఎలా దర్శనమిస్తాయని చిన్నచిన్న తప్పిదాల వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఇకనైనా ఈ చిన్న చిన్న తప్పిదాలు మార్చుకోవాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
Minister: కొవిడ్ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు
Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..
Read Latest Telangana News And Telugu News