Share News

‘ప్రొటోకాల్‌పై చీఫ్‌విప్‌ మహేందర్‌రెడ్డి ఆగ్రహం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:29 AM

వికారాబాద్‌ జిల్లా తాండూరు అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని.. ఈ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తాండూరు పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తనకు ప్రొటోకాల్‌ ప్రకారం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ప్రొటోకాల్‌పై చీఫ్‌విప్‌ మహేందర్‌రెడ్డి ఆగ్రహం
మహేందర్‌రెడ్డి పేరులేని మున్సిపల్‌ శాఖ ఏర్పాటు చేసిన ఆహ్వాన పత్రిక

రాజీనామాకు సిద్ధమైన సూపరింటెండెంట్‌

మెప్మా సిబ్బంది, కమిషనర్‌పై మండిపాటు

తాండూరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా తాండూరు అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని.. ఈ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వ చీఫ్‌విప్‌ మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తాండూరు పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తనకు ప్రొటోకాల్‌ ప్రకారం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యఅతిథిగా స్పీకర్‌ ప్రసాద్‌ హాజరై ప్రారంభించాల్సిన మాతాశిశు ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభోత్సవానికి అందరికంటే ముందుగా మహేందర్‌రెడ్డి చేరుకున్నారు. అక్కడ కార్యక్రమానికి సంబంధం లేకున్నా ఆవరణలో ఏర్పాటు చేస్తున్నందుకు అక్కడకు వచ్చిన జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవిశంకర్‌ను మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న సబ్‌కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌పై మండిపడ్డారు. అలాగే మున్సిపల్‌ కమిషనర్‌ విక్రం సింహారెడ్డి, మెప్మా టీఎంసీ రాజేంద్రప్రసాద్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా చేస్తే కుదరదని హెచ్చరించారు. కార్యక్రమానికి మెప్మా టీఎంసీ, పీడీ, మున్సిపల్‌ కమిషనర్‌లు ప్రొటోకాల్‌ ప్రకారం ఆహ్వానించాల్సి ఉండగా.. దాన్ని పాటించలేదు. పద్ధతి మార్చుకోవాలని కమిషనర్‌ను హెచ్చరించారు. సంబంధం లేకున్నా తమపై అనవసరంగా మహేందర్‌రెడ్డి మండిపడటంపై నొచ్చుకున్న సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది. అయితే, పూర్తి వివరాలు తెలుసుకోకుండా మహేందర్‌రెడ్డి వైద్యాధికారులపై మండిపడటాన్ని కొందరు తప్పు పడుతూ విమర్శిస్తున్నారు. అసలు మెప్మా అధికారులు మున్సిపల్‌ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమకు ఎలాంటి సంబంధం లేదని కేవలం షాప్‌ కేటాయించే వరకు మాత్రమే తమ బాధ్యత అని డీసీహెచ్‌వో ప్రదీప్‌కుమార్‌ ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

Updated Date - Dec 07 , 2024 | 12:29 AM