ఓవర్‌లోడ్ టిప్పర్లపై ఫిర్యాదు
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:51 PM
క్రషర్ నుంచి డస్టును ఓవర్‌లోడ్ వేసుకుని వెళుతున్న టిప్పర్లతో తిప్పలు తప్పడంలేదని ఆటోయూనియన్ సభ్యులు, గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి సంజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
పెద్దేముల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): క్రషర్ నుంచి డస్టును ఓవర్‌లోడ్ వేసుకుని వెళుతున్న టిప్పర్లతో తిప్పలు తప్పడంలేదని ఆటోయూనియన్ సభ్యులు, గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి సంజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. టిప్పర్లు, టార్‌సలలో వాటిక్యాబిన్‌కంటే ఎత్తులో డస్టును తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రుక్మాపూర్, రేగొండి శివారులో గల క్రషర్ మిషన్ నుంచి డస్టును పెద్దపెద్ద టిప్పర్లు, టార్‌సలలో డస్టును తరలిస్తున్నారని తెలిపారు. దీంతో మంబాపూర్‌లోని స్పీడ్‌బ్రేకర్ల వద్ద టిప్పర్లలో తరలిస్తున్న డస్టు కిందకు జారుతోందని అన్నారు. వాహనాలు వెళ్లే వేగానికి క్యాబిన్‌కంటే ఎత్తుగా ఉన్న డస్టు గాలికి లేచి ప్రయాణికుల కళ్లలో పడుతోందని వాపోయారు. క్రషర్ యజమానికి చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదని, సంబంధిత అధికారులు స్పందించి తమ ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఓవర్‌లోడ్‌తో వాహనాలు వెల్లకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేదంటే తాము ఆందోళనకు సిద్ధమవుతామన్నారు.