Share News

తాగునీటి ఎద్దడిని నివారించాలి : ఎంపీపీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:14 AM

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రజాప్రతినిధులలో కలిసి ప్రత్యేకాఽధికారులు పనిచేయాలని ఎంపీపీ మంద జ్యోతి తెలిపారు. గురువారం మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కందుకూరు, లేమూరు, గ్రామాల ఎంపీటీసీలు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, యాదయ్యలు పాల్గొని మాట్లాడారు.

తాగునీటి ఎద్దడిని నివారించాలి : ఎంపీపీ

కందుకూరు, ఏప్రిల్‌ 18 : వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రజాప్రతినిధులలో కలిసి ప్రత్యేకాఽధికారులు పనిచేయాలని ఎంపీపీ మంద జ్యోతి తెలిపారు. గురువారం మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కందుకూరు, లేమూరు, గ్రామాల ఎంపీటీసీలు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, యాదయ్యలు పాల్గొని మాట్లాడారు. ప్రత్యేకాఽధికారులుగా నియామకమై రెండు నెలలు గడుస్తున్నా ఎంపీటీసీలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు తమ వంతు పనిచేస్తామన్నారు. సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎంపీపీ, ఎంపీడీవో సరితలు మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం ప్రతీరోజు 65లక్షల లీటర్ల కృష్ణానీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్న కొన్ని గ్రామాల్లో బోర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ప్రత్యేక అఽధికారికి మూడు నుంచి నాలుగు గ్రామాలను కేటాయించడంతో ఎంపీటీసీలను కలువలేకపోతున్నట్లు చెప్పారు. వచ్చే రెండు నెలల వరకు నీటి ఎద్దడి రాకుండా చూడాలని కోరారు. ఇందుకోసం మండలానికి ఒక ఐఏఎస్‌ అధికారిని ప్రభుత్వం కేటాయించినట్లు గుర్తుచే శారు. కాగా, మండల కేంద్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పొలిస్తే.. నేడు అధికంగా జనాభా పెరిగిందని, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎంపీటీసీ రాజశేఖర్‌రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీవో స్పందిస్తూ... ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. మండల సహకార సంఘం చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ జగన్మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, సురేష్‌, ఇందిరదేవేందర్‌, బాల్‌రాజ్‌, యాదయ్య, మల్లేష్‌, ఎల్లారెడ్డి, అచ్చన్న పద్మపాండు, రాజమ్మ, మండల పరిషత్తు కో-ఆప్షన్‌ మెంబర్‌ ఎండీ సులేమాన్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 07:43 AM