భూమి విషయంలో దాయాదుల ఘర్షణ
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:38 AM
పొలం విషయంలో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కులకచర్ల, అక్టోబరు 9: పొలం విషయంలో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బండవెల్కిచర్లకు చెందిన హన్మంత్‌రెడ్డి తన పొలంలో వేరుశనగ విత్తనాలు వేస్తుండగా పక్కపొలానికి చెందిన దాయాదులు చిన్నారెడ్డి, నర్సింహారెడ్డి, లక్ష్మమ్మలు కర్రలతో హన్మంత్‌రెడ్డిపై బుధవారం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హన్మంత్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో తిరుపతిరెడ్డి అనే వ్యక్తి అక్కడికి చేరుకొని వారికి మద్దతు తెలిపాడు. గాయపడిన హన్మంత్‌రెడ్డిని పరిగి ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై, వారికి మద్దతు తెలిపిన తిరుపతిరెడ్డి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.