దండాలు మైసమ్మ తల్లో..
ABN , Publish Date - Nov 15 , 2024 | 11:49 PM
కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక పౌర్ణమి మొదలు కార్తీక శష్టి వరకు ఆరు రోజుల పాటు కనుల పండువగా ఉత్సవాలు కొనసాగుతాయి
మైసిగండిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఉత్సవాలను ప్రారంభించిన ఆలయ ఫౌండర్‌ట్రస్టీ సిరోలిపంతూ
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు
కడ్తాల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి ): కడ్తాల మండలం మైసిగండి మైసమ్మ దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక పౌర్ణమి మొదలు కార్తీక శష్టి వరకు ఆరు రోజుల పాటు కనుల పండువగా ఉత్సవాలు కొనసాగుతాయి. ఇందులో భాగంగా వేదపండితులు సుప్రభాత సేవతో మైసమ్మ అమ్మవారికి మేలుకొల్పు పాడారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి స్నేహలతతో కలిసి ఆలయ ఫౌండర్ ట్రస్టీ రామావత్ సిరోలిపంతూ అమ్మ వారికి పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు. అమ్మవారి కలశంతో మేళతాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాధవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణ, కుంభహారతి కార్యక్రమాలు నిర్వహించారు. కుంభహారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌నాయక్, శ్రీపాతి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధికారప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యనాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యనాయక్, తులసీరామ్‌నాయక్, శేఖర్‌గౌడ్, హన్మనాయక్, రామావత్ భాస్కర్, చాట్ల లింగప్ప, ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్, ఆర్.పి.జ్యోతి అరుణ్ పాల్గొన్నారు.