Share News

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:03 PM

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మోకిల పోలీసులు సిబ్బంది ఈనెల 11న ఇంద్రారెడ్డి నగర్‌లో పెట్రోలింగ్‌ చేస్తుండగా రోడ్డుపక్కన గుర్తుతెలియని సుమారు 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

శంకర్‌పల్లి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మోకిల పోలీసులు సిబ్బంది ఈనెల 11న ఇంద్రారెడ్డి నగర్‌లో పెట్రోలింగ్‌ చేస్తుండగా రోడ్డుపక్కన గుర్తుతెలియని సుమారు 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు. చుట్టుపక్కల వారిని విచారించగా ఎవరూ గుర్తుపట్టలేదు. దాంతో అతడిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈమేరకు చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడు ఏప్రాంతానికి చెందిన వాడో తెలియరాలేదని, అతన్ని ఎవరైనా గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే, అతడు ఆకలితో గానీ, అనారోగ్యంతో గానీ చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

పురుగులమందు తాగి వ్యక్తి..

మాడ్గుల, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని నాగిళ్ళ గ్రామానికి చెందిన దోనాల యాదయ్య(48) కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందిన అతడు మంగళవారం ఇంట్లో పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు హైదరాబద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించినట్లు సీఐ జగదీష్‌ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 19 , 2024 | 11:03 PM