నకిలీ బంగారు నాణేల పట్టివేత
ABN , Publish Date - Sep 08 , 2024 | 10:36 PM
నకిలీ బంగారు నాణేలను అసలైన బంగారు నాణేలని నమ్మించి ఎక్కువ ధరకు విక్రయించాలని యత్నించిన ముగ్గురిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
ముగ్గురు నిందితుల రిమాండ్
షాద్‌నగర్ రూరల్, సెప్టెంబరు 8 : నకిలీ బంగారు నాణేలను అసలైన బంగారు నాణేలని నమ్మించి ఎక్కువ ధరకు విక్రయించాలని యత్నించిన ముగ్గురిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండి గ్రామానికి చెందిన భాషపాక సుజిత్, భాషపాక రమేశ్ అదే జిల్లా పాలకుర్తి మండలం మైత్తర గ్రామానికి చెందిన పలనాటి అశోక్ ముగ్గురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు కర్ణాటకలోని బళ్లారిలో మహేశ్ అనే వ్యక్తి దగ్గర నకిలీ బంగారు నాణేలు కొనుగోలు చేశారు. ఈ నెల 5న రాత్రి షాద్‌నగర్ మీదుగా వాటిని హైదరాబాద్ తరలిస్తుండగా షాద్‌నగర్ పోలీసులు రాయికల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ముగ్గురినీ శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.