ధ్యానానికి వేళాయె..
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:41 PM
మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహాయాగం -3 వేడుకలకు ముస్తాబైంది. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ స్పిర్చ్యువల్ మూమెంట్ ఆఫ్ ఇండియా, పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి ధ్యాన మహాయాగం-3 వేడుకలు ప్రారంభం
మహేశ్వరం పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
వేడుకలను ప్రారంభించనున్న ఎంపీ మల్లు రవి
కడ్తాల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి ): మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన మహాయాగం -3 వేడుకలకు ముస్తాబైంది. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ స్పిర్చ్యువల్ మూమెంట్ ఆఫ్ ఇండియా, పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. 21 నుంచి 31వ తేదీ వరకు పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలను శనివారం సాయంత్రం 5 గంటలకు నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రారంభిస్తారని పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ వేడుకలకు దేశ, విదేశాల నుంచి ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు, ఆధ్యాత్మిక వేత్తలు రానున్నన్నారని చెప్పారు. ధ్యానులకు ఉచిత భోజన వసతి కల్పించారు. పిరమిడ్‌లోని సరస్వతి ప్రాంగణంలో 30 వేల మంది సామూహిక ధ్యానం చేసుకునేలా వేదికను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 5గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సంగీత విద్వాంసులచే అఖండ ధ్యానం, పత్రీజీ ధ్యాన వీడియో సందేశాలు, సాంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. వేడుకల ఏర్పాట్లను శుక్రవారం ట్రస్ట్ సభ్యులతో కలిసి విజయభాస్కర్‌రెడ్డి, పిరమిడ్ కో-ఆర్డినేటర్ మాధవి పరిశీలించారు.