Share News

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:39 PM

నిబంధనలకు విరుద్ధంగా, మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ పట్టుబడితే కఠినంగా చర్యలు తప్పవని బషీరాబాద్‌ ఎస్‌ఐ పి.శంకర్‌ వాహనదారులను హెచ్చరించారు.

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు

బషీరాబాద్‌, డిసెంబరు 19(ఆంద్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా, మద్యం సేవించి వాహనాలు నడిపిస్తూ పట్టుబడితే కఠినంగా చర్యలు తప్పవని బషీరాబాద్‌ ఎస్‌ఐ పి.శంకర్‌ వాహనదారులను హెచ్చరించారు. ఎస్పీ ఆదేశానుసారం గురువారం ఎస్సై బషీరాబాద్‌లోని రైల్వేస్టేషన్‌ కూడలిలో ఆటో, జీపు డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ అనేక చర్యలు చేపడుతున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపిస్తే భారీ జరిమానాతో పాటు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 11:39 PM