హైటెన్షన్ లైన్ ఏర్పాటు చేయొద్దు
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:49 PM
సాగు చేసుకుంటున్న పంట పొలాల నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకుండా చూడాలని కడ్తాల రైతులు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవిని కోరారు. 765 కేవీ హైటెన్షన్ పోల్ సర్వే మార్కింగ్‌ను వెంటనే నిలిపివేయించి తమ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ మల్లు రవికి కడ్తాల రైతుల వినతి
కడ్తాల్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): సాగు చేసుకుంటున్న పంట పొలాల నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయకుండా చూడాలని కడ్తాల రైతులు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవిని కోరారు. 765 కేవీ హైటెన్షన్ పోల్ సర్వే మార్కింగ్‌ను వెంటనే నిలిపివేయించి తమ ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కడ్తాల మండల కేంద్రంలో ఆదివారం పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీతనర్సింహలతో కలిసి డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీనర్సింహరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కడారి రామకృష్ణల ఆధ్వర్యంలో రైతులు ఎంపీ మల్లు రవిని కలిసి వినతిపత్రం అందజేశారు. వ్యవసాయేతర పొలాల మీదుగా ఇతర ప్రాంతం నుంచి లైన్‌ను ఏర్పాటుచేసి తమకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కోరారు. కడ్తాల గ్రామాన్ని అనుసరించి 66 సర్వే నెంబర్లలోని 150 మంది రైతుల పంటపొలాల మీదుగా 765కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్‌అండ్‌టీ సంస్థ శ్రీకారం చుట్టి లైన్ మార్కింగ్ చేశారని ఎంపీకి వివరించారు. బీదర్ నుంచి మీర్‌ఖాన్‌పేట వరకు ఏర్పాటుచేసే కొత్త హైటెన్షన్ లైన్‌ను తమ పొలాల మీదుగా ఏర్పాటు చేస్తే రూ.కోట్ల విలువైన భూములు కోల్పోయి రైతులు రోడ్డున పడుతారని నాయకులు వినతిపత్రంలో పేర్కొన్నారు. గ్రామాన్ని అనుసరించి లైన్ ఏర్పాటు చేయడం వల్ల దినదినాభివృద్ధి చెందుతున్న కడ్తాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, లైన్ ఏర్పాటు మార్గంలో అనేక చోట్ల వెంచర్లు, కోళ్ల పరిశ్రమలు, పాడిషెడ్లు, వ్యవసాయ బోర్లు ఉన్నాయని ఎంపికి వివరించారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకొని హైటెన్షన్ పోల్ అలైన్‌మెంట్ మార్పించాలని శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీనర్సింహరెడ్డి, రామకృష్ణలు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లి హైటెన్షన్ లైన్‌ను మార్చేలా చూస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు అభిషేక్‌రెడ్డి, కాంటేకార్ శ్రీను, గోరటి శేఖర్, క్యామ రాజేశ్, బోసు రవి, పెంటారెడ్డి, రాములు, జంగారెడ్డి, జంగయ్య, తిరుపతిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, పాండు,మల్లేశ్, గణేశ్, శేఖర్‌రెడ్డి, శివకుమార్, సేవ్యనాయక్, చెన్నయ్య, మహేశ్, స్వామి, శ్రీకాంత్, జంగయ్య, రమేశ్, రవి, నర్సింహ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీచ్యనాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్‌పతినాయక్, తదిదతరులు ఉన్నారు.