Share News

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తనీయొద్దు

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:50 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తనీయొద్దు
తేమ శాతం పరిశీలిస్తున్న మోహన్‌రెడ్డి

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి

బొంరా్‌సపేట్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు. గురువారం ఆయన బొంరా్‌సపేట్‌, ఏర్పుమళ్ల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో నిబంధనలు పాటించాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ మద్దతు ధర కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం నాందర్‌పూర్‌ గ్రామంలో పంటను పరిశీలించి సస్యరక్షణ మెళకువలను పాటించాలని రైతులకు వివరించారు. ఆయనతో ఏడీఏ శంకర్‌రాథోడ్‌, ఏఈవోలు శైలజ, స్వాతి తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:50 PM