Share News

అనుమానాస్పద స్థితిలో డ్రైవర్‌ మృతి

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:36 AM

అనుమానాస్పద స్థితిలో ఓ డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో డ్రైవర్‌ మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, అక్టోబరు 9: అనుమానాస్పద స్థితిలో ఓ డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హర్యానా, జింద్‌ జిల్లా రాంనగర్‌కు చెందిన సుక్విందర్‌సింగ్‌(49) హర్యానా నుంచి నాలుగురోజుల కిందట లారీలో హైదారాబాద్‌కు వచ్చాడు. ట్రావెల్స్‌ పోర్ట్‌ ఏజెన్సీ ద్వారా కాటన్‌ సీడ్స్‌ను నల్లగొండలో లోడ్‌ చేసుకొని హర్యానాకు బయల్దేరాడు. బుధవారం మార్గమధ్యలో ఘనాపూర్‌ చౌరస్తా ఔటర్‌ రింగ్‌రోడ్డుపై లారీని పక్కన నిలిపి డ్రైవింగ్‌ సీట్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, అనారోగ్యంతోనే సుక్విందర్‌ మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Oct 10 , 2024 | 07:12 AM