Share News

బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్ట్‌

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:11 AM

ఆమనగల్లు మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని బొమ్మరాస్‌ పేట, దుద్యాల మండలాల పరిధిలో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు మద్దతుగా ఆమనగల్లు నుంచి బయలు దేరుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్ట్‌
కొందుర్గు : పోలీసుల అదుపులో నాయకులు

ఆమనగల్లు/కందుకూరు/కేశంపేట/చౌదరిగూడ/ కొందుర్గు, అక్టోబరు 9: ఆమనగల్లు మండలానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను బుధవారం పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని బొమ్మరాస్‌ పేట, దుద్యాల మండలాల పరిధిలో ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు మద్దతుగా ఆమనగల్లు నుంచి బయలు దేరుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యనాయక్‌, జిల్లా నాయకుడు గుత్తి బాలస్వామి, మున్సిపాలిటీ కార్యదర్శి వడ్డెమోని శివకుమార్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ గణేశ్‌లను స్టేషన్‌కు తరలించారు. అలాగే బీఆర్‌ఎస్‌ నేతలను ఉదయం కందుకూరు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ నేతృత్వంలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి భారీగా నేతలు కొడంగల్‌కు తరలివెళ్లడానికి సిద్ధమవుతుండగా ఉదయం గ్రామాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. నేతలు సురేందర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కాకి దశరథ, క్రిష్ణ,దీక్షీ త్‌రెడ్డి. గణేష్‌, మహేష్‌, రాజులను అరెస్టు చేశారు. అలాగే షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ తనయులు కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌, మురళీకృష్ణలను మండల పరిధిలోని ఎక్లా్‌సఖాన్‌పేటలో వారి స్వగృహంలో ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. కేశంపేట ఏఎ్‌సఐ నర్సింలు, పీసీ శ్రీశైలంగౌడ్‌ సాయంకాలం వరకు అక్కడే ఉన్నారు. మాజీ ఎంపీపీ మట్లాడుతూ రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెస్‌ అక్రమంగా అరె్‌స్టలు చేస్తుందన్నారు. జిల్లేడ్‌ చౌదరిగూడ, కొందుర్గు మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కొందుర్గు మాజీ ఎంపీపీ రాజేష్‌ పటేల్‌, శ్రీధర్‌రెడ్డి, రామకృష్ణ, బాబురావు, అక్రం, వెంకటేష్‌, శేఖర్‌ తదితరులున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:11 AM