Share News

బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:11 AM

గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు
చెన్‌గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు

పూడూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలను సందర్శించేందుకు వెళుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య, పూడూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు రాంచంద్రయ్యలు కస్తూర్భా గురుకుల పాఠశాలను సందర్శించేందుకు సోమవారం బయల్దేదారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ముందస్తు అరెస్టు చే సి చెన్‌గోముల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Dec 03 , 2024 | 12:11 AM