Share News

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:19 AM

ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. శంకర్‌పల్లిలో శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి టీయూఎ్‌ఫఐడీసీ నిధులు రూ.21.40 కోట్లతో చేపట్టే సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే
శంకర్‌పల్లిలో టీయూఎ్‌ఫఐడీసీ నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. శంకర్‌పల్లిలో శుక్రవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మీ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి టీయూఎ్‌ఫఐడీసీ నిధులు రూ.21.40 కోట్లతో చేపట్టే సీసీరోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శంకర్‌పల్లి మున్సిపల్‌ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రగతిపథంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. రోడ్లు, మురుగుకాలువల నిర్మాణం శంకర్‌పల్లిలో పెద్ద ఎత్తున ఇప్పటికే చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నదని ఆయన అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే యాదయ్య పిలుపునిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వివరించారు. మున్సిల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, డీఈ యాదయ్య, ఏఈ సాయి కిరణ్‌, కౌన్సిలర్లు శ్రీనాథ్‌గౌడ్‌, అశోక్‌, గోపాల్‌, చంద్రమౌళి, కో-ఆప్షన్‌ సభ్యుడు మైమూద్‌, నాయకులు గోపాల్‌రెడ్డి, ప్రకాష్‌, గోపాల్‌, అశోక్‌కుమార్‌, రవిందర్‌రెడ్డి, చంద్రమోహన్‌, రఘునందర్‌రెడ్డి. మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:19 AM