Share News

చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:49 PM

కుర్చీపై నుంచి కిందపడి వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

పూడూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కుర్చీపై నుంచి కిందపడి వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. చెన్‌గోముల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలాఉన్నాయి. చెన్‌గోముల్‌ గ్రామానికి చెందిన సామగోళ్ల మాణెమ్మ(76) ఈనెల 20వ తేదీన ఉదయం 9 గంటల ప్రాంతంలో పరిగి మండలంలోని రంగాపూర్‌లో ఉంటున్న తన అక్క చంద్రమ్మను చూసేందుకు వెళ్లింది. 21వ తేదీన ఉదయం 8గంటలకు అక్క ఇంటి ముందు కుర్చీలో కూర్చున్న మాణెమ్మ ఉన్నట్టుండి కిందపడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు వికారాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బీపీ తగ్గడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి పంపించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి మనవడు సామాగోళ్ల విష్ణు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 22 , 2024 | 11:49 PM