Share News

రూ.3లక్షల విద్యుత్‌ వైర్‌చోరీ

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:03 AM

నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో గుర్తుతెలియని దుండగులు గోడలకు ఫిట్టింగ్‌ చేసిన రూ.3లక్షల విలువైన విద్యుత్‌ వైర్‌ను చోరీ చేశారు.

రూ.3లక్షల విద్యుత్‌ వైర్‌చోరీ

చేవెళ్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో గుర్తుతెలియని దుండగులు గోడలకు ఫిట్టింగ్‌ చేసిన రూ.3లక్షల విలువైన విద్యుత్‌ వైర్‌ను చోరీ చేశారు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీస్‌ల కథనం మేరకు.. చేవెళ్ల పట్టణ కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర హార్డ్‌వేర్‌ షాపు యాజమని ఆంజనేయులుగౌడ్‌ నూతనంగా నాలుగు అంతస్తుల భవనం నిర్మాణం నిర్మించాడు. భవనంలో సీలింగ్‌ వర్క్‌తో పాటు భవనం మొత్తం విద్యుత్‌ వైరింగ్‌ను ఇటీవల పూర్తిచేయించాడు. సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు విద్యుత్‌ వైర్‌ను పూర్తిగా లాగేసి, లిఫ్ట్‌వైర్‌ను కూడా దొంగిలించారు. సీసీ కెమెరా నుంచి ఆంజనేయులుగౌడ్‌కు మెసేజ్‌ రావడంతో భవనం వద్దకు వచ్చేలోగా దుండగులు వైరుతో పారిపోయారు. ఆంజనేయులు పోలీస్‌లకు సమాచారం అందించడంతో చుట్టుపక్కల వెతికినా దొంగల ఆచూకీ లభించలేదు. వైర్‌ విలువ రూ.3లక్షలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం ఉదయం చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:03 AM