Share News

పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:10 AM

పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ హరిసర్వోత్తమన్‌ అన్నారు. జీవవైవిధ్యం దెబ్బతింటే మానవాళి మనుగడకు ప్రమాదమన్నారు.

పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది

కడ్తాల్‌, సెప్టెంబరు 12: పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ హరిసర్వోత్తమన్‌ అన్నారు. జీవవైవిధ్యం దెబ్బతింటే మానవాళి మనుగడకు ప్రమాదమన్నారు. అన్మా్‌సపల్లి సమీపంలోని దిఎర్త్‌ సెంటర్‌లో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన స్కూల్‌ ఎర్త్‌క్లబ్‌, యంగ్‌ ఎర్త్‌ లీడర్స్‌ రెండో విడత అవగాహన కార్యక్రమం గురువారం ముగిసింది. కౌన్సిలర్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలాలక్ష్మారెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి హరిసర్వోత్తమన్‌, ప్రముఖ విద్యావేత్త ఉపేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ డీఎ్‌సవో శ్రీనివాస రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సులో మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు చెందిన 66 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హరిసర్వోత్తమన్‌ మాట్లాడుతూ జీవ వైవిధ్య ప్రాముఖ్యతను ప్రతీ పౌరుడు గుర్తెరిగి మసులుకోవాలన్నారు. ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశనుంచే పర్యావరణ, జీవన విలువలు, నైపుణ్యాలు నేర్పి భవిష్యత్తులో పరిరక్షకులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. లీలాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాల ఒక ఎర్త్‌సెంటర్‌గా రూపాంతరం చెందాలన్నారు. సీజీఆర్‌ సంస్థ సభ్యులు డాక్టర్‌ సాయిభాస్కర్‌రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త ఉమామహేశ్వర్‌రెడ్డి, సీజీఆర్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 07:47 AM