Share News

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రం

ABN , Publish Date - May 14 , 2024 | 12:47 AM

ఓటింగ్‌ ముగియడంతో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని ఈవీఎంలన్నింటినీ భారీ పోలీసు భద్రత మధ్య చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బీఎ్‌సఐటీ కాలేజీ స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు.

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రం
బీఎస్‌ఐటీకి తరలిస్తున్న ఈవీఎంలు

చేవెళ్ల బీఎస్‌ఐటీకి తరలింపు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఓటింగ్‌ ముగియడంతో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని ఈవీఎంలన్నింటినీ భారీ పోలీసు భద్రత మధ్య చేవెళ్ల మండలం గొల్లపల్లిలోని బీఎ్‌సఐటీ కాలేజీ స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఓటింగ్‌ పక్రియ ముగియగానే ఈవీఎంలు,. వీవీప్యాట్‌లకు సీల్‌ వేసి తొలుత అసెంబ్లీ స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడ నుంచి ఈవీఎంల సంఖ్యను సరిచూసుకుని నేరుగా కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇక్కడకు ఈవీఎంలు తీసుకువచ్చారు. ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించే వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానం చేసి ట్రాకింగ్‌ చేశారు. సోమవారం రాత్రి అభ్యర్ధుల సమక్షంలో వీటిని స్ట్రాంగ్‌రూమ్‌లో చేర్చారు. ఓట్ల లెక్కింపు మే 4న బీఎ్‌సఐటీ కాలేజీ జరగనుంది. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈవీఎంలు, వీవీప్యాట్‌ల భద్రత కోసం మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణలో నిరంతరం సీఆర్‌పీఎఫ్‌, కేంద్ర బలగాల స్ట్రాంగ్‌ చుట్టూ పహారాకాస్తున్నాయి.

Updated Date - May 14 , 2024 | 12:47 AM