Share News

ప్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Nov 18 , 2024 | 11:21 PM

ప్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయినన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్‌ అన్నారు.

ప్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ప్యాబ్‌సిటీ భూ నిర్వాసితులతో మాట్లాడుతున్న కేఎల్లార్‌

-కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్‌

మహేశ్వరం నవంబరు 18 ( ఆంధ్రజ్యోతి): ప్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయినన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్‌ అన్నారు. సోమవారం జెన్నాయిగూడ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి రైతులతో మాట్లాడారు. ప్యాబ్‌ సిటీ కోసం దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పటి ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కొందరు రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారని అప్పటి నుంచి పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వాలు ముందుకు రాలేదన్నారు. 2022లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థానిక నాయకుల సమక్షంలో ప్యాబ్‌సిటీ రైతులకు లేఅవుట్‌ చేసి ప్లాట్లు ఇస్తామని చెప్పినా ఆ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూములు కోల్పోయినన ప్రతీ రైతు కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా తాను బాధ్యత తీసుకుంటానన్నారు. అదే విధంగా జెన్నాయిగూడ గ్రామానికి గ్రామకంఠం ఏర్పాటు చేసి భూముల క్రయవిక్రయాలు జరిగేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టబద్దత కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రె్‌స నాయకులు, రైతులు పాండురాంగారెడ్డి, నర్సింహ, మాదవరెడ్డి, యాదయ్య, భిక్షపతి, శ్రీశైలం, లక్ష్మయ్య, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 11:22 PM