ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు అండగా ప్రభుత్వం
ABN , Publish Date - Nov 15 , 2024 | 11:52 PM
ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయినన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్) అన్నారు. శుక్రవారం జెన్నాయిగూడ, రావిరాల గ్రామాల రైతులు తుక్కుగూడలోని కేఎల్లార్ కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు.
అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాం
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్
మహేశ్వరం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఫ్యాబ్‌సిటీ భూ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, భూములు కోల్పోయినన ప్రతీ రైతుకు తగిన న్యాయం చేస్తామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్) అన్నారు. శుక్రవారం జెన్నాయిగూడ, రావిరాల గ్రామాల రైతులు తుక్కుగూడలోని కేఎల్లార్ కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు. ఆయన మాట్లాడుతూ ఫ్యాబ్‌సిటీ కోసం దాదాపు 20 ఏళ్ల క్రితం అప్పటి ఏపీఐఐసీ ఆధ్వర్యంలో కొందరు రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి భూ నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వాలు ముందుకు రాలేదన్నారు. 2022లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక నాయకుల సమక్షంలో ఫ్యాబ్‌సిటీ రైతులకు లే అవుట్ చేసి ప్లాట్లు ఇస్తామని చెప్పగా.. పలు కారణాల చేత సమస్య పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ముందుకు వస్తుందని, భూములు కోల్పోయిన ప్రతీ రైతు కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా తాను బాధ్యత తీసుకుంటానన్నారు. కాస్తు ధారులకు ఎకరాకు 150 గజాలు, సీలింగ్ పట్టాదారులకు 250 గజాలు, 38 ఈ పట్టాదారులకు ఎకరానికి 600 వందల గజాల చొప్పున ప్లాట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని జెన్నాయిగూడ భూ నిర్వాసితులకు కేఎల్లార్ హామీ ఇచ్చారు. పాండు రంగారెడ్డి, నర్సింహ, మాధవరెడ్డి, యాదయ్య, భిక్షపతి, శ్రీశైలం, లక్ష్మయ్య, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.