Share News

నడవడికను బట్టే కీర్తి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:10 AM

నడవడికను బట్టి కీర్తి, వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుందని పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, ధ్యాన గురువు పరిణతి పత్రీజీలు అన్నారు. గురువు మార్గం ముక్తికి ద్వారమన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి కైలాసపురి మహేశ్వర మహపిరమిడ్‌లో ధ్యాన మహాయాగం వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

నడవడికను బట్టే కీర్తి
మాట్లాడుతున్న పరిణతి పత్రీజీ

విజయభాస్కర్‌రెడ్డి, పరిణతి పత్రీజీ

కడ్తాల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి ): నడవడికను బట్టి కీర్తి, వర్తమానాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుందని పిరమిడ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, ధ్యాన గురువు పరిణతి పత్రీజీలు అన్నారు. గురువు మార్గం ముక్తికి ద్వారమన్నారు. కడ్తాల మండలం అన్మా్‌సపల్లి కైలాసపురి మహేశ్వర మహపిరమిడ్‌లో ధ్యాన మహాయాగం వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన వేడుకలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు, సాధ కులు, సందర్శకులు, పిరమిడ్‌ మాస్టర్లు, ఆధ్యాత్మిక వేత్తలు భారీగా తరలి వచ్చారు. ధ్యానులు పత్రీజీ శక్తిస్థల్‌ ను సందర్శించి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 5నుంచి 8 గంటల వరకు సామూహిక ప్రాతకాలం సంగీత ధ్యానం నిర్వహించారు. ప్రపంచ ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ ధ్యాన వీడియో సందేశాలను వినిపించారు. మూడు గంటలపాటు ధ్యానంలో లీనులయ్యారు. అనంతరం పలు ధ్యాన, ఆధ్యాత్మిక పుస్తకాలను పిరమిడ్‌ ట్రస్టీ చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌ రెడ్డి, పరిణిత పత్రీజీ ఆవిష్కరించారు. ధ్యాన విలువలను చాటుతూ పుస్తకాలను వెలువరిస్తున్న రచయితలను అభినందించారు. అదేవిదంగా నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.

అలరించిన కళారూపాలు

ధ్యాన మహాయాగంలో గురువారం కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ అలరించాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ప్రదర్శనల ద్వారా ఆకట్టుకున్నారు. నృత్యరూపకాలు అదరహో అనిపించాయి. ఈ కార్యక్రమాల్లో పిరమిడ్‌ ట్రస్ట్‌ సభ్యులు సాంబశివరావు, హన్మంతరావు, మాధవి, దామోదర్‌రెడ్డి, లక్ష్మి, అన్మా్‌సపల్లి మాజీ సర్పంచ్‌ శంకర్‌, సరోజ, సంగమేశ్వర్‌, గణేశ్‌, దీప్తి, అనురాఽధ, మారం శివప్రసాద్‌, భాస్కరానంద, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:10 AM