రాష్ట్రపతి ముర్ముకు ఘన వీడ్కోలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:23 AM
శీతాకాల విడిదిని ముగించుకొని తిరిగి ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం హకీంపేట విమానాశ్రయమంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్‌రావు, కలెక్టర్ గౌతమ్‌లు ఘనంగా వీడ్కోలు పలికారు.
హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ప్రెసిడెంట్
మేడ్చల్ ప్రతినిధి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి) : శీతాకాల విడిదిని ముగించుకొని తిరిగి ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం హకీంపేట విమానాశ్రయమంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు వేణుగోపాల్‌రావు, కలెక్టర్ గౌతమ్‌లు ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, ఈ నెల 17న హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ఐదు రోజుల పర్యటనను ముగించుకొని తిరిగి ఢిల్లీకి పయణమయ్యారు.
రాష్ట్రపతి పర్యటన విజయవంతంలో అధికారుల పాత్ర అభినందనీయం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన విజయవంతం చేయడంలో జిల్లాస్థాయిలో అన్ని శాఖల అధికారుల పాత్ర అభినందనీయమని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. రాష్ట్రపతి శీతాకాల విడిది శనివారంతో ముగియడంతో ఆమె ఢిల్లీకి బయల్దేరిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఐదు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటనలో అధికారులు సమన్వయంతో ముందుకుసాగారని, వారికి అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, సమాచార, రహదారులు, విద్యుత్తు, అటవీ, ఆరోగ్య, సివిల్ సప్లయ్, అగ్నిమాపక శాఖతో పాటు అన్నిశాఖల అధికారులు కలిసికట్టుగా చేయడం వల్లనే రాష్ట్రపతి పర్యటన విజయవంతంగా ముగిసిందన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ గౌతమ్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.