Share News

భయం గుప్పిట్లోనే..!

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:24 AM

లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనతో కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, రోటిబండ తండావాసులు భయాందోళలనకు గురవుతున్నారు. దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (ఫార్మా క్లస్టర్‌) ఏర్పాటుకు భూసేకరణపై ప్రజాభిప్రాయం నిర్వహించేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనతో రెండు రోజులుగా స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

భయం గుప్పిట్లోనే..!
లగచర్లలో దిగులుగా కూర్చున్న మహిళలు

లగచర్ల ఘటనతో ఆ రెండు గ్రామాలు

అరెస్టులతో ఉలికిపాటు

పట్నం నరేందర్‌రెడ్డి

రిమాండ్‌తో ఆందోళన

ఎప్పుడు ఎవరిని అరెస్టు

చేస్తారోనని భయం

రోటిబండ తండాలో ఇంకా ఇళ్లకు చేరుకోని జనం

లగచర్లలో ఇప్పుడిప్పుడే

తెరుచుకుంటున్న ఇళ్లు

కొడంగల్‌/బొంరా్‌సపేట్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ఘటనతో కొడంగల్‌ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల, రోటిబండ తండావాసులు భయాందోళలనకు గురవుతున్నారు. దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (ఫార్మా క్లస్టర్‌) ఏర్పాటుకు భూసేకరణపై ప్రజాభిప్రాయం నిర్వహించేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనతో రెండు రోజులుగా స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులపై దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం కావడంతో ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనన్న భయం వారిలో వ్యక్తమవుతోంది. దాడి ఘటనతో మంగళవారం లగచర్ల, రోటిబండ తండావాసులు భయంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లారు. కేవలం మహిళలు, వృద్ధులు మాత్రమే గ్రామంలో ఉన్నారు. అయితే, గురువారం మాత్రం లగచర్ల గ్రామంలోకి కొందరు జనం వచ్చారు. రోటిబండ తండాలోని పరిస్థితిలో మాత్రం ఏమాత్రం తేడా లేదు. ఇక్కడ జనం ఇంకా ఇళ్లకు వచ్చేందుకు జంకుతున్నారు. అర్ధరాత్రి వచ్చి తమ పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకు వెళ్లడంతో ఈ రెండు గ్రామాల ప్రజలు రెండు రోజులుగా దిగులుతోనే గడిపారు. కొందరైతే అన్నపానీయాలకు దూరంగా ఉన్నట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వానికి విన్నవించి వారిని విడుదల చేయించాలని బుధవారం లగచర్లలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిర్మానుష్యంగా మారిన లగచర్ల, రోటిబండ తండాల్లో బుధవారం భయాందోళన ప్రభావం కొంత తగ్గింది. దుకాణాలు తెరుచుకొని ప్రజలు వీధుల్లో కనిపించారు. ఎప్పుడేమవుతుందోననే ఆందోళన అక్కడి వారిలో వ్యక్తమవుతోంది. ఎప్పుడు పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

లగచర్లలో సోమవారం ఇండస్ర్టియల్‌ కారిడార్‌కు సంబంధించి భూ అభిప్రాయ సేకరణలో భాగంగా అధికారులపై జరిగిన దాడి సంఘటనతో గత మూడు రోజులుగా ఇంటర్నె ట్‌ సేవలను పోలీసులు బంద్‌ చేయించారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌, దుద్యాల మండల పరిధిలో సేవలు బంద్‌ చేశారు. మీ సేవా కేంద్రా లు, బ్యాంకులతో పాటు ఇతర ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా ఇంటర్నెట్‌ సేవలను పునఃప్రారంభించాలనికోరుతున్నారు.

లగచర్ల ఘటనపై ఎంపీ డీకే అరుణ ఆరా

వికారాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ జిల్లా లగచర్లతో అధిరారులపై జరిగిన దాడి విషయమై బుదవారం మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ను కలిసి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫార్మా కంపెనీ భూసేకరణ, అందుకు సంబంధించిన అంశాలను కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే పరిహారం, తీసుకుంటున్న భూమి వివరాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు సమాచారం. కాగా, దాడికి గల కారణాలు, ఎవరు దాడిచేసి ఉంటార నే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి స్ధానిక నాయకులు ఉన్నారు.

నా కుమారుడిని విడిపించండి

చేయని తప్పుకు నా కుమారుడిని పోలీసులు అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లారు. అతడు ఏ తప్పూ చేయలేదు. కుమారుడిని తక్షణమే విడిపించండి. - మంగమ్మ, లగచర్ల

Updated Date - Nov 14 , 2024 | 12:24 AM