Share News

చేపల పెంపకంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలి

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:44 AM

చేపల పెంపకంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

చేపల పెంపకంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలి
చేపపిల్లలను వదులుతున్న ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి

శామీర్‌పేట, అక్టోబరు 9: చేపల పెంపకంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం వారు ముఖ్య అతిథులుగా హాజరై శామీర్‌పేట పెద్దచెరువు నీటిలో చేపపిల్లలను వదిలారు. ప్రభుత్వం నుంచి 100శాతం సబ్సిడీ కింద 80-100 ఎంఎం సైజ్‌లో ఉన్న 3,60,000 కట్ల, రవ్వు, మోను, రకాల విత్తన చేపపిల్లలను వారు చెరువు నీటిలో వదిలారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫిష్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి, జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మన్‌ మన్నె రాజు, మోహన్‌కృష్ణ, వేణుగోపాల్‌, వెంకటేశం, దేవేందర్‌, అనురాధ, సత్యవతి, రాము పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 12:44 AM