పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:12 AM
పేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమనగల్లు, కల్వకుర్తి, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల, వెల్దండ మండలాలకు చెందిన 300 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు బాలాజీసింగ్, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కల్వకుర్తి అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కసిరెడ్డి పంపిణీ చేశారు.
ఆమనగల్లు, అక్టోబరు 9: పేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమనగల్లు, కల్వకుర్తి, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల, వెల్దండ మండలాలకు చెందిన 300 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు బాలాజీసింగ్, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కల్వకుర్తి అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి కసిరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం అని అన్నారు. ఆమనగల్లు పట్టణంలో రూ.17.57 కోట్లతో అధునాతన ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. వెల్దండ ప్రభుత్వాసుపత్రికి నూతన భవన నిర్మాణానికి రూ.కోటి నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. కాంగ్రెస్ మండలాధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, జగన్, డీసీసీ ఉపాధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్‌ఖాద్రీ, శ్రీశైలం, నాయకులున్నారు.