Share News

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ మెంబర్‌కు రిమాండ్‌

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:08 AM

డబ్బులు డిమాండ్‌ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ మెంబర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌ విధించిన ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు.. జూపల్లి బాలమ్మ మెమోరియల్‌ సంస్ధలో పని చేసే మోహన్‌రావు వద్ద ముచ్చింతల్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ మెంబర్‌ చిలకమర్రి నర్సింహ రూ.పది లక్షలు తీసుకుని మరిన్ని డబ్బులు కావాలని వేధిస్తున్నాడు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ మెంబర్‌కు రిమాండ్‌

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 9 : డబ్బులు డిమాండ్‌ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ మెంబర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌ విధించిన ఘటన శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు.. జూపల్లి బాలమ్మ మెమోరియల్‌ సంస్ధలో పని చేసే మోహన్‌రావు వద్ద ముచ్చింతల్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ మెంబర్‌ చిలకమర్రి నర్సింహ రూ.పది లక్షలు తీసుకుని మరిన్ని డబ్బులు కావాలని వేధిస్తున్నాడు. ఈనెల 2న బాధితుడు శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మెంబర్‌ కావున న్యాయ సలహా తీసుకొని బుధవారం అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడు వాట్సాప్‌ కాల్‌ చేసినట్లు బాధితుడి వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మైహోం గ్రూప్‌ అధినేత జూపల్లి జగపతిరావు మీద గత కొన్ని రోజుల క్రితం చిలకమర్రి నర్సింహ శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

Updated Date - Oct 10 , 2024 | 07:23 AM