Share News

నాలుగు లీటర్ల సారా పట్టివేత

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:05 AM

మండల పరిధిలో ఇద్దరు వ్యక్తుల వద్ద నాలుగు లీటర్ల సారా పట్టుబడినట్లు ఎక్సైజ్‌ సీఐ బాలగంగాధర్‌ తెలిపారు.

నాలుగు లీటర్ల సారా పట్టివేత
పోలీసుల అదుపులో నిందితులు

పెద్దేముల్‌, డిసెంబరు 26: మండల పరిధిలో ఇద్దరు వ్యక్తుల వద్ద నాలుగు లీటర్ల సారా పట్టుబడినట్లు ఎక్సైజ్‌ సీఐ బాలగంగాధర్‌ తెలిపారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ విజయభాస్కర్‌ ఆదేశాలమేరకు మండలంలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ నిజాముద్దిన్‌తో పాటు మరికొంతమంది ఎక్సైజ్‌ పోలీసులు ఊరెంటి తండావద్ద రూట్‌వాట్‌ నిర్వహించారు. అదే సమయంలో ఊరెంటితండా వైపునుంచి రాంసింగతండా వైపు హీరోహోండాపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని సోదాలు చేయగా వారివద్ద రెండు ప్లాస్టిక్‌బాటిళ్లలో 4లీటర్ల సారా లభ్యమైంది. దీంతో సారాను తరలిస్తున్న రాథోడ్‌రవి, చవాన్‌ సోనీబాయిలను ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసునమోదు చేశామని సీఐ తెలిపారు. నాటుసారా తయారు చేయడం చట్టరీత్యా నేరమని చెప్పారు. సారా తయారు చేసినా, విక్రయించినా వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

Updated Date - Dec 27 , 2024 | 12:05 AM