గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:16 AM
గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి అన్నారు.
పరిగి/తాండూరు, సెప్టెంబరు 4: గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పరిగిలోని గ్రీన్‌పార్కు హోటల్‌లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఉత్సవాలను హిందూ, ముస్లింలు సోదరభావంతో నిర్వహించుకోవాలన్నారు. మండపాల వివరాలను పోలీసుస్టేషన్‌లతో తప్పక నమోదు చేయించుకోవాలని సూచించారు. మండపాలు, ఉత్సవాల్లో ఏమైనా ఇబ్బందికర సంఘటనలు జరిగితే మండపాల నిర్వాహకులే బాధ్యత వహించాలన్నారు. లౌడ్‌స్పీకర్లు, డీజేలకు అనుమతి తప్పనిసరన్నారు. రాత్రి పదిలోపు పూజలు, ఇతర కార్యక్రమాలన్నీ ముగించాలని సూచించారు. మద్యం సేవించికానీ, అనుమతి లేని కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ ఎం.అశోక్, డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సీఐ ఎన్.శ్రీనివా్‌స, ఎస్‌ఐ ఎం.సంతోష్, కమిషనర్ వెంకటయ్య, విద్యుత్ ఏఈ ఖాజా, మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సురేందర్, డీసీసీ ప్రధానకార్యదర్శి కె.హన్మంత్, నాయకులు ఇ.కృష్ణ, బి.ప్రవీణ్‌రెడ్డి, వి.పెంటయ్య, ఎం.నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అపోహలు, అసత్య ప్రచారాన్ని నమ్మకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి కోరారు. తాండూరు గ్రాండ్ హోటల్‌లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మతసామరస్యానికి తాండూరును ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, తహసీల్దార్ తారాసింగ్, సీఐలు, నాయకులు రాజుగౌడ్, నర్సింలు పాల్గొన్నారు.