గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Sep 07 , 2024 | 12:30 AM
మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి సూచించారు. శుక్రవారం కేశంపేట మండల కేంద్రంలోని బీఎ్సవై గార్డెన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ మండపం ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరు పోలీ్‌సశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.
షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి
కేశంపేట/తలకొండపల్లి, సెప్టెంబర్ 6: మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి సూచించారు. శుక్రవారం కేశంపేట మండల కేంద్రంలోని బీఎ్సవై గార్డెన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ మండపం ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరు పోలీ్‌సశాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. గణేష్ మండలంలో విద్యుత్ కనెక్షన్‌కు విధిగా అనుమతి పొందాలని తెలిపారు. గణేష్ ఏర్పాటు అనంతరం మండపంలో ఇద్దరు ఉండాలని తెలిపారు. పండుగలను సామరాస్యంగా చేసుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ మీర్అజాంఅలీ, ఎంపీడీవో రవిచంద్రకుమార్ రెడ్డి, షాద్‌నగర్‌రూరల్ సీఐ సత్యనారాయణ, కేశంపేట ఎస్సై రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమనగల్లు సీఐ ప్రమోద్ కుమార్ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని దేవకి గార్డెన్లో పీస్ కమిటీ మీటింగ్ ఎస్సై శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ హిందూ, ముస్లింలు సోదర భావంంతో పండగలు నిర్వహించుకోవాలన్నారు. తలకొండపల్లి తహసీల్దార్ రంగారెడ్డి, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో రాఘవులు, మాజీ సర్పంచ్ లు లలితజ్యోతయ్య, మోహన్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అనిల్, నాయకులు కుమార్, సజ్జుపాష, అజీమ్, కోటేశ్వర్, మహేశ్ తదితరులు ఉన్నారు.
మట్టి వినాయాకులనే పూజిద్దాం
ఆదిభట్ల/షాబాద్/శంషాబాద్/చేవెళ్ల/కందుకూరు : పర్యావరణ పరిరక్షణలో ప్రతీ వ్యక్తి భాగసామ్యం కావాలని, మట్టి వినాయకులనే పూజిద్దామని ఆదిభట్ల ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం వర్కాల పరమేష్ పిలుపు నిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకొని శుక్రవారం స్కూలు విద్యార్థులకు మట్టి గణపతి ప్రతిమలు అందజేశారు. అలాగే మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్‌కుమార్ అన్నారు. షాబాద్ మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. శ్రీను పంతులు, తమ్మలి రవీందర్, మల్లిఖార్జున్, రఘునందన్‌గౌడ్, గోవర్దన్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్, సుదీర్, బస్వరాజ్, అశోక్, తదితరులు ఉన్నారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్, ఎయిర్‌పోర్టు, కోత్వాల్‌గూడ, జెండా చౌరస్తాలు, అంగడిబజార్, తదితర ప్రాంతాల్లో చిన్న వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేశారు. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున ప్రతిష్ఠించనున్నారు. కొందరు ఆటోలో తిరుగుతూ శంషాబాద్ మున్సిపాలిటీలోని వివిధ బస్తీల్లో వినాయకుడి విగ్రహాలను అమ్మారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పర్యావరణ అవార్డు గ్రహీత రామకృష్ణ తెలిపారు. చేవెళ్ల మండల కేంద్రంలో మట్టి వినాయకుడి విగ్రహాలను అందజేశారు. శంకర్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టివినాయకుడి విగ్రహాలను అందించారు. కందుకూరు మండలంలో మండపాల ఏర్పాట్లు చేపట్టారు. మండల కేంద్రంలో చింతకాయ, తుమ్మికూర, మిర్చి అమ్మకాలు జోరుగా సాగాయి.
వినాయక ఉత్సవాలకు సౌండ్‌బాక్స్‌ల వితరణ
కేశంపేట : మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో వినాయక ఉత్సవాలకు పల్లె బ్రదర్స్ పల్లె ఆనంద్ కుమార్, పల్లె బాలీశ్వర్‌లు సౌండ్ బాక్స్‌లను వితరణ చేశారు. గ్రామంలో 8 చోట్ల వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. వారికి డిజే సౌండ్ బాక్స్‌లను శుక్రవారం బాలీశ్వర్ ఫాంహౌస్‌లో అందించారు. ఉత్సవాలను శాంతయుతంగా జరుపుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో సూరం శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, బాల్‌రాజు, వెంకటేష్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.