Share News

రూ.17లక్షల విలువైన గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:40 PM

మేడ్చల్‌ ప్రాంతంలోని కళాశాలల్లో చదివే విద్యార్థులకు గంజాయి సరఫరా చేసే ముఠాను ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు.

రూ.17లక్షల విలువైన గంజాయి పట్టివేత
పోలీసుల అదుపులో యువకులు

  • పోలీసుల అదుపులో నిందితులు

మేడ్చల్‌టౌన్‌, జూలై 26: మేడ్చల్‌ ప్రాంతంలోని కళాశాలల్లో చదివే విద్యార్థులకు గంజాయి సరఫరా చేసే ముఠాను ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి రూ.17లక్షలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ నవనీత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రెండు రోజులుగా ఎక్సైజ్‌ అధికారులు గంజాయి విక్రయిస్తున్న ప్రాంతాలపై నిఘాపెట్టారు. మేడ్చల్‌ ప్రాంతంలో నివాసముంటున్న సుతారి గుణశేఖర్‌(22), చల్లమల్ల శరత్‌ల(23) గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో నిఘాపెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్దనుంచి 3.6 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇరువురిని విచారించగా అవిశెట్టి అభిరాం(21), ఎర్ర ఆదిత్య(22) వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి సరఫరాచేస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు అభిరాం, ఆదిత్యల నివాసాలపై దాడులు నిర్వహించారు. వారివద్ద నుంచి సుమారు రూ.13లక్షల విలువనైన 4.4 కిలోల గంజాయి లభించింది. అదేవిధంగా గుండ్లపోచంపల్లి మహాంకాళి కాలనీలో ఉంటున్న పి.కార్తీక్‌, రాయల అరుణబాబు, ఎన్‌.కమల్‌ల వద్ద నుంచి 4కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా జరిపిన దాడుల్లో రూ.17లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ నవనీత తెలిపారు. కాగా, గుండ్లపోచంపల్లి పరిధిలోని కళాశాలల్లో చదివే విద్యార్థులకు గంజాయి విక్రయించడానికి ఈ ముఠా పనిచేసేదని తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా స్విగ్గీ బ్యాగుల్లో గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు కాగా, పట్టుబడిన నలుగురు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న మరొకరిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:40 PM