Share News

చెత్త డంపింగ్‌ యార్డు పనులు నిలిపివేయాలి

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:42 PM

గ్రామ సమీపంలో చెత్త డంపింగ్‌యార్డు పనులను నిలిపివేయాలని బయన్నగూడ వాసులు డిమాండ్‌ చేశారు.

చెత్త డంపింగ్‌ యార్డు పనులు నిలిపివేయాలి
ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించిన గ్రామస్తులు

శంకర్‌పల్లి, జూన్‌ 20: గ్రామ సమీపంలో చెత్త డంపింగ్‌యార్డు పనులను నిలిపివేయాలని బయన్నగూడ వాసులు డిమాండ్‌ చేశారు. శంకర్‌పల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట గురువారం గ్రామస్తులు బైఠాయించి నిరసన చేపట్టారు. గ్రామంలో చెత్త డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. చెత్తను కాల్చడంతో దుమ్ము, ధూళి చెలరేగడంతో పాటు పొగతో గ్రామస్తుల ఆరోగ్యం పాడవుతుందని వాపోయారు. మహాలింగపురం గ్రామానికి చెందిన చెత్తను తమ గ్రామంలో వేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ చెత్త వేస్తే కుక్కల బెడద ఎక్కువై కాలి నడకన వచ్చేవారికి ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మండల పంచాయతీ అధికారి గీత ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తానని చెప్పడంతో వారు శాంతించారు. నర్సింహారెడ్డి, కాంతిరెడ్డి, మాణిక్‌రెడ్డి, బుచ్చయ్య, విఠలయ్య, మల్లారెడ్డి, ప్రశాంత్‌, ప్రకాష్‌, పాండురంగారెడ్డి, రజినీకాంత్‌, వెంకట్‌రెడ్డి, రాములు, బుచ్చయ్య, మల్లేషం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 11:43 PM