Share News

కుక్కల దాడిలో మేకలు, గొర్రెలు మృత్యువాత

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:53 PM

మేకలు, గొర్రెపిల్లలపై కుక్కలు దాడిచేశాయి. కుక్కల దాడిలో 5మేకపిల్లలు, 2గొర్రెపిల్లలు మృతి చెందాయి.

కుక్కల దాడిలో మేకలు, గొర్రెలు మృత్యువాత

పెద్దేముల్‌, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మేకలు, గొర్రెపిల్లలపై కుక్కలు దాడిచేశాయి. కుక్కల దాడిలో 5మేకపిల్లలు, 2గొర్రెపిల్లలు మృతి చెందాయి. ఈసంఘటన పెద్దేముల్‌ మండల పరిధిలోని గాజీపూర్‌ గ్రామంలో జరిగింది. బాదితులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్‌ మండలం గాజీపూర్‌ గ్రామానికి చెందిన బుద్దారం లక్ష్మప్పకు గొర్రెలు, మేకలు ఉన్నాయి. వాటిని మేతకు తీసుకువెల్లే సమయంలో వాటికి జన్మించిన చిన్నిచిన్న మేకలు, గొర్రెలపిల్లలను ఇంటివద్ద జాలిలో వదిలి వెలుతారు. ఇంటివద్ద దొడ్డిగా ఏర్పాటుచేసి చుట్టూ ఇనుపకంచె ఏర్పాటు చేసినా అందులోకి సోమవారం కుక్కలు దూరాయి. మేకపిల్లలు, గొర్రెపిల్లలపై దాడిచేసి కరిచి చంపేశాయి. కుక్కల దాడిలో 5మేకపిల్లలు, 2గొర్రెపిల్లలు మృతి చెందాయి. అది గమనించిన లక్ష్మప్ప కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలమైన తాము మేకలు, గొర్రెలను పెంచుతూ తాము జీవనోపాది పొందుతున్నామని, గొర్రెపిల్లలు, మేకపిల్లలు కుక్కల దాడిలో మృతి చెందినందున ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:53 PM