Share News

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:07 AM

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సొసైటీ చైర్మన్‌ కనకం మొగులయ్య తెలిపారు. మండలంలోని తిరుమలాపూర్‌లో ఆదివారం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మొగులయ్య

కులకచర్ల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సొసైటీ చైర్మన్‌ కనకం మొగులయ్య తెలిపారు. మండలంలోని తిరుమలాపూర్‌లో ఆదివారం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు బీఎస్‌.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్‌, అంజిలయ్యగౌడ్‌, కొండయ్యగౌడ్‌, వెంకటయ్యగౌడ్‌, జలీల్‌, సత్యనారాయణ, ఉమాశంకర్‌, భూపాల్‌, చిన్నయ్య పాల్గొన్నారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని డీఎస్‌వో మోహన్‌బాబు తెలిపారు. కులకచర్లలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌ యార్డులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ధాన్యం తూకాలు, రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యం తూకం కాగానే ట్యాబ్‌లో నమోదు చేయాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్‌ కనకం మొగులయ్య పాల్గొన్నారు.

బొంరాస్‌పేట్‌: ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌తో కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ జయకృష్ణ తెలిపారు. బొంరాస్‌పేట్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో సన్నధాన్యం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సింహులుగౌడ్‌, వెంకట్రాములుగౌడ్‌, వీరేశం, కృష్ణ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:07 AM