Share News

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

ABN , Publish Date - Jun 16 , 2024 | 12:05 AM

ళ్లులేని పేదలు ఇళ్లు కట్టుకోవడానికి త్వరలోనే నియోజకవర్గంలో ఇందిరమ్మ పథకం కింద మూడున్నర వేల ఇళ్లు మం జూరు చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

కల్యాణలక్ష్మి చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే ఎం.రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, జూన్‌ 15: ఇళ్లులేని పేదలు ఇళ్లు కట్టుకోవడానికి త్వరలోనే నియోజకవర్గంలో ఇందిరమ్మ పథకం కింద మూడున్నర వేల ఇళ్లు మం జూరు చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలోని క్యాంప్‌ కార్యాలయం లో శనివారం 92 మందికి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పేరిట పేదల ను మోసం చేసిందన్నారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల అ మలుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ధరణి పెండింగ్‌ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామ న్నారు. త్వరలోనే అర్హులకు రేషన్‌ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. ప్రతీ బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యలపై నేరుగా చెప్పుకోవచ్చని చెప్పారు. మరో పదేళ్లు రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే ఉంటుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సునీతారెడ్డి, జెడ్పీటీసీ బి.మహిపాల్‌, ఆధిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్‌పర్సర్లు నిరంజన్‌రెడ్డి, కప్పరి స్రవంతి, వైస్‌చైర్మన్‌ బర్ల మంగ, డీటీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2024 | 12:05 AM