Share News

అర్హులందరికీ గృహజ్యోతి వర్తింపు

ABN , Publish Date - Feb 09 , 2024 | 12:05 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం(200యూనిట్లు) అమలకు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వినియోగదారుల వివరాలు సేకరిస్తున్నారు.

అర్హులందరికీ గృహజ్యోతి వర్తింపు
చేవెళ్లలో విద్యుత్‌ వినియోగదారుల వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఈ వెంకన్న, సిబ్బంది

చేవెళ్ల, ఫిబ్రవరి 8: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం(200యూనిట్లు) అమలకు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వినియోగదారుల వివరాలు సేకరిస్తున్నారు. గురువారం చేవెళ్లలో ట్రాన్స్‌కో సూపరింటెండె ంట్‌ ఇంజినీర్‌ వెంకన్న, డీఈఈ శివశంకర్‌, ఏడీఈ స్వామి గృహ వినియోగదారుల మీటర్‌ నంబర్‌, ఆధార్‌/రేషన్‌ కార్డుల నంబర్లను సేకరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది గృహ జ్యోతి పథకానికి అర్హుల జాబితాను సేకరిస్తున్నామ న్నారు. ఈ నెల 15లోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలున్నాయన్నారు. నెలనెలా బిల్‌ కొట్టేం దుకు వచ్చే సిబ్బందికి మీటర్‌ నంబర్‌, ఆధార్‌/రేషన్‌ కార్డు నంబర్లు ఇవ్వాలని కోరారు. ఒక వేళ ఇళ్ల వద్ద అందుబాటులో లేనివారు ఏఈ కార్యాలయంలో వివరాలు అందజేయాలని సూ చించారు. సేకరిస్తున్న ఎప్పటికప్పుడు డేటాను ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు చెప్పారు. పేద లందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెం టు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈ జానీ మొయినుద్దీన్‌, లైన్‌మన్‌ పుల్లయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.

షాబాద్‌: అర్హులైన వారు గృహజ్యోతి పథకానికి వివరాలు నమోదు చేసుకోవాలని షాబాద్‌ ఏఈ నరేందర్‌ అన్నారు. మండలంలో నాగర్‌గూడ, తాళ్లపల్లి తదితర గ్రామాల్లో గృహజ్యోతి పథకం కోసం వినియోగదారుల వివరాలను సేకరించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడు తూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా అమలు చేయనున్న గృహజ్యోతి పథకం కోసం అర్హులైన వినియోగదారులను గుర్తించే పని చేపట్టామన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని, మీటర్‌ రీడింగ్‌కు వచ్చే సిబ్బందికి బిల్లింగ్‌ సమయంలో వినియోగదారులు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఫోన్‌ నంబర్‌ అందజేయాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 09 , 2024 | 12:05 AM