Share News

హైదర్‌ అలీకి కలెక్టర్‌ నారాయణరెడ్డి సన్మానం

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:02 AM

జిల్లా కలెక్టరేట్‌ ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేసిన హైదర్‌ అలీ శనివారం పదవీ విరమణ పొందారు. ఈసందర్భంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి హైదర్‌ అలీ దంపతులను శాలువా కప్పి సన్మానించారు.

హైదర్‌ అలీకి కలెక్టర్‌ నారాయణరెడ్డి సన్మానం
హైదర్‌ అలీకి జ్ఞాపిక అందజేస్తున్న కలెక్టర్‌, తదితరులు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టరేట్‌ ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేసిన హైదర్‌ అలీ శనివారం పదవీ విరమణ పొందారు. ఈసందర్భంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి హైదర్‌ అలీ దంపతులను శాలువా కప్పి సన్మానించారు. అనంతరం వారికి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా హైదర్‌ అలీ సేవలను కలెక్టర్‌ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో సునీల్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:02 AM