Share News

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ABN , Publish Date - Nov 12 , 2024 | 12:37 AM

మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన నర్సింహులుగౌడ్‌ కుటుంబసభ్యులు సోమవారం పూజ నిర్వహించి బయటకువెళ్లారు.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
బండవెల్కిచర్లలో దగ్ధమైన ఇల్లు

కులకచర్ల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బండవెల్కిచర్ల గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌సర్య్కూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన నర్సింహులుగౌడ్‌ కుటుంబసభ్యులు సోమవారం పూజ నిర్వహించి బయటకువెళ్లారు. అంతలోనే షార్ట్‌సర్య్కూట్‌తో ఇంట్లో నిప్పంటుకుంది. ఇంట్లో ఉన్న బీరువాలో సామాన్లు, వస్తువులు, తినుబండరాలు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్రామస్థులు గమనించి నీటితో మంటలను చల్లార్చారు. అనంతరం పరిగి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో నర్సింహులుగౌడ్‌ కుటుంబం కట్టుబట్టలతో బయటే ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

Updated Date - Nov 12 , 2024 | 12:37 AM