Share News

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:20 AM

షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎలికట్ట శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైనాయి.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

భార్యకు తీవ్ర గాయాలు

షాద్‌నగర్‌ రూరల్‌, ఆగస్టు 28: షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎలికట్ట శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలైనాయి. పోలీసుల కథనం ప్రకారం వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం విఠలాపూర్‌ గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్‌(35), అతడి భార్య సునీత హైతాబాద్‌ దగ్గర వెంకటాపూర్‌ సమీపంలో జరిగిన బంధువుల ఫంక్షన్‌ కోసం బైక్‌పై వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో ఎలికట్ట చౌరస్తా సమీపంలో వెనుక నుంచి లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో మహేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా భార్య సునీతకు రెండు కాళ్లు విరిగాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

కోనాపూర్‌ గేటు వద్ద గొర్రెల కాపరి..

ఆమనగల్లు, ఆగస్టు 28: మండల పరిధిలోని కోనాపూర్‌ గేటు వద్ద హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతిచెందాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలం హనుమాన్‌పల్లికి చెందిన గొర్రెల కాపరి ఆంజనేయులు గొర్రెలను మేపుకుంటూ వెళ్తున్నాడు. ఆమనగల్లు మండలం కోనాపూర్‌ గేటు వద్ద హైదరాబాద్‌ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న డీసీఎం గొర్రెల వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆంజనేయులును ఢీకొంది. దాంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుండగా అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకుడు ఎంఏ హఫీజ్‌, కొందరు యువకులు ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో 10 గొర్రెలు కూడా మృతి చెందాయి.

Updated Date - Aug 29 , 2024 | 08:45 AM