Share News

ఇష్టపడి చదివితే భవిష్యత్‌

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:29 PM

విద్యార్థి దశ చాలా కీలకమని, కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు.

ఇష్టపడి చదివితే భవిష్యత్‌
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

బొంగులూరు మోడల్‌ స్కూల్‌, హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్‌

ఇబ్రహీంపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ చాలా కీలకమని, కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శనివారం రాత్రి ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి బొంగులూరు మోడల్‌ స్కూల్‌, హాస్టల్‌ను ఆయన సందర్శించారు. అక్కడ ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మరుగుదొడ్లు, వంట శాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల బోధన తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వం మంచి వాతావరణంలో స్కూల్‌, హాస్టల్‌ వసతి కల్పిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, తాగు నీటికి ఇబ్బందిగా ఉందని, దోమ తెరలు ఇప్పించాలని బాలికలు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో కె.అనంతరెడ్డి, తహసీల్దారు సునీతారెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:29 PM