Share News

టీచర్ల అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:05 AM

అక్రమంగా ఇచ్చిన డిప్యుటేషన్లను రద్దు చేసి ఉపాధ్యాయులను పనిచేస్తున్న ప్రాంతాలకు పంపించాలని సోషలిస్టు విద్యార్థి సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ జంతుక శంకర్‌ కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీఈవో డిప్యుటేషన్లు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఆమనగల్లు పట్టణంలో మంగళవారం శంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లపైతీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

టీచర్ల అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేయాలి

ఆమనగల్లు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): అక్రమంగా ఇచ్చిన డిప్యుటేషన్లను రద్దు చేసి ఉపాధ్యాయులను పనిచేస్తున్న ప్రాంతాలకు పంపించాలని సోషలిస్టు విద్యార్థి సంఘం రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ జంతుక శంకర్‌ కోరారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డీఈవో డిప్యుటేషన్లు ఇవ్వడం సరైంది కాదన్నారు. ఆమనగల్లు పట్టణంలో మంగళవారం శంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లపైతీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమనగల్లు, కడ్తాల మండలాల పరిధిలోని అక్రమంగా ఇచ్చిన డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. ఆమనగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ జ్యోతిని అబ్దూల్లాపూర్‌మెట్‌ మండలం తాటి అన్నారంనకు, కడ్తాల మండలం రావిచెడ్‌ జడ్పీహెచ్‌ఎస్‌ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు శ్రీదేవిని సరూర్‌నగర్‌ మండలం కర్మాన్‌ఘాట్‌ జడ్పీహెచ్‌ఎస్‌కు పంపించినట్లు శంకర్‌ తెలిపారు. దాంతో రావిచెడ్‌ పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించడానికి ఉపాద్యాయులు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, ఆమనగల్లులో పీఈటీ లేకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారని తెలిపారు. అవసరమైతే డిప్యుటేషన్‌ ఇచ్చిన చోట ఉపాధ్యాయులు అవసరముంటే విద్యా వలంటీర్లను నియమించుకోవాలే తప్ప అక్రమంగా డిప్యుటేషన్లు ఇవ్వడం తగదన్నారు.

Updated Date - Oct 23 , 2024 | 12:05 AM