రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:31 PM
ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తాండూర్ సబ్‌కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, పెద్దనందిగామ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
కొడంగల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఽధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తాండూర్ సబ్‌కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, పెద్దనందిగామ గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. సోమవారం ఆయా గ్రామాల్లో పర్యటించిన ఆయన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ బీ.విజయ్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కొడంగల్ రూరల్: మండలంలోని అప్పాయిపల్లి, పెద్దనందిగామ గ్రామాల్లో సోమవారం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తాండూర్ సబ్‌కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కొనుగోలు కేంద్రంలో తేమ శాతం కొలిచే యంత్రాలను, తూనీకల యంత్రాలను పరిశీలించారు. ఆయన వెంబడి తహసీల్దార్ విజయ్‌కుమార్, ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.