ఈటల ఆధ్వర్యంలో బీజేపీలో చేరిక
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:50 PM
తూంకుంట మున్సిపల్ పరిఽధిలోని హకీంపేట, సింగాయిపల్లి ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన నివాసంలో బీజేపీలో చేరారు.
శామీర్‌పేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): తూంకుంట మున్సిపల్ పరిఽధిలోని హకీంపేట, సింగాయిపల్లి ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన నివాసంలో బీజేపీలో చేరారు. ఈమేరకు బీజేపీ జిల్లా కార్యదర్శి హైమారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి రాజేందర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.