కీసరగుట్టలో భక్తుల కోలాహలం
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:49 PM
కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యల్లో విచ్చేశారు. కార్తీక మాసోత్సవంలో భాగంగా రెండోరోజు గర్భాలయంలోని మూలవిరాట్‌కు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు.
-నేడు దీపోత్సవం, హాజరుకానున్న మంత్రి కొండా సురేఖ
కీసర, నవంబరు, 3(ఆంధ్రజ్యోతి): కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. కార్తీక మాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యల్లో విచ్చేశారు. కార్తీక మాసోత్సవంలో భాగంగా రెండోరోజు గర్భాలయంలోని మూలవిరాట్‌కు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. ఆనంతరం భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కాగా, నేడు కార్తీకమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని స్వామివారికి నానావిధ ఫల రసాభిషేకం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాయంత్రం ఆరు గంటలకు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి సేవలో నవీన్ మిట్టల్
కార్తీక మాసం సందర్భంగా చీర్యాల్ లక్ష్మీనరసింహస్వామిని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి గౌడ్, అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ మహామండపంలో దంపతులిద్దరికీ స్వామివారి జ్ఞాపికను అందజేసి సత్కరించారు.