Share News

యంత్రాల కొరత.. పొలంలోనే పంట

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:04 AM

వానాకాలం ఆరుగాలం శ్రమించి సాగు చేసిన ప్రస్తుతం పంటలు చేతికి వచ్చాయి. అకాల వర్షాల కు పంటలు దెబ్బతిని మిగిలిన కాస్త దిగుబడితో అయినా గట్టెక్కు దామనుకుంటే యంత్రాలు, కూలీల కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

యంత్రాల కొరత.. పొలంలోనే పంట
గోనూరులో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట

  • కూలీలు దొరక్క ఇబ్బందులు

  • ఆందోళనలో అన్నదాతలు

తాండూరు రూరల్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ఆరుగాలం శ్రమించి సాగు చేసిన ప్రస్తుతం పంటలు చేతికి వచ్చాయి. అకాల వర్షాల కు పంటలు దెబ్బతిని మిగిలిన కాస్త దిగుబడితో అయినా గట్టెక్కు దామనుకుంటే యంత్రాలు, కూలీల కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాండూరు మండలంలోని ఆయా గ్రామాల్లో గత వానాకాలం సీజన్‌లో వరిపంటను 5,638ఎకరాల్లో రైతులు సాగుచేశారు. అయితే ప్రస్తుతం పంట చేతికి రావడంతో కూలీలు, యంత్రాల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గోనూరు, నారాయణపూర్‌, అంతారం, అంతారం తండా, చెంగోల్‌, అల్లాపూర్‌ వీర్‌శెట్టిపల్లి, బెల్కటూర్‌, రాంపూర్‌, పర్వతాపూర్‌, చింతామణిపట్నం గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. వరికోత యంత్రాలు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కర్నూలు, షాద్‌నగర్‌ నుంచి ఈ ప్రాంతానికి వస్తుంటాయి. అక్కడ కూడా వరిసీజన్‌ కావడంతో యంత్రాల కొరత తీవ్రంగా ఏర్పడింది.

యంత్రాలు లేక పొలాల్లోనే వరిపంట: చాకలి బాలప్ప, రైతు, గోనూరు

ఈ సంవత్సరం వరిపంట ఆశాజనకంగా ఉంది. అయితే వరి కోసేందుకు వరికోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. గత సంవత్సరం వరిపంట కోతకు వచ్చేముందు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వరి కోత యంత్రాలు ఇక్కడికి వచ్చి రైతులకు అందుబాటులో ఉండేవి. ఈసారి యంత్రాల కొరత వల్ల ఎకరాకు రూ.2500లు ఇచ్చినా యంత్రాలు దొరకడం లేదు. దీంతో వరిపంట పొలంలోనే ఉంది.

Updated Date - Nov 20 , 2024 | 12:04 AM