Share News

లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:59 PM

పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ్మాస్వామి దేవాలయం తృతీయ వార్షికోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు ప్రారంభం
స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే

పరిగి,అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ్మాస్వామి దేవాలయం తృతీయ వార్షికోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం యాగశాల ప్రవేశం, విశ్వేశ్వనఅనాధాన, వాసుదేవ పుణ్యావచనం,దీక్షాదారణ, రుత్వీకర్మగణం, మృత్యంగ్రహణం, అంకురార్పణ, ఆఖండదీపారాధన, ఆగ్నిప్రతిష్ట, హోమం, ధ్వజారోహణం పూజ, హోమం, భేరిపూజ, దేవతాహ్వానం,నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిని ఆలయ ధర్మకర్తలు ఎదిరె పద్మ,కృష్ణ, జయశ్రీ,నరేందర్‌లు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, మాజీ జడ్పీటీసీ ఎస్‌పి బాబయ్య, డీసీసీ కార్యదర్శి కె.హన్మంత్‌ముదిరాజ్‌,పరుశరాంరెడ్డి,కృష్ణ, నిర్వహకులు, కౌన్సిలర్‌ ఎదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ ఉచిత వైద్య సేవలు అందిస్తాం: ఎమ్మెల్యే

పరిగి: ఆరోగ్యశ్రీ వర్తించని వారందరికీ సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగిలోని తన నివాసంలో మంగళవారం వివిధ మండలాలకు చెందిన వారి కుటుంబాలకు సీఎంఆర్‌ఎప్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏ వ్యక్తి కూడా ఆరోగ్యం పట్ల ఇబ్బందులు పడకూడదన్నారు. అందరికీ ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బి.పరశురాంరెడ్డి, తావుర్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:59 PM