పూల తివాచీ పరిచినట్టు!
ABN , Publish Date - Jan 28 , 2024 | 11:04 PM
యాచారంలో రోడ్డు పక్కన ఓ చెట్టు ఎర్రని పూలు విరబూసి వచ్చీపోయేవారిని ఆకట్టుకుంటోంది. ఆకులు, మండలు కన్పించకుండా చెట్టంతా పూలే దర్శనమిస్తూకనువిందు చేస్తోంది.
యాచారంలో రోడ్డు పక్కన ఓ చెట్టు ఎర్రని పూలు విరబూసి వచ్చీపోయేవారిని ఆకట్టుకుంటోంది. ఆకులు, మండలు కన్పించకుండా చెట్టంతా పూలే దర్శనమిస్తూకనువిందు చేస్తోంది. ఉదయం, సాయంత్రం ఈ చెట్టు అందం మరింత పెరుగుతూ ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. యువకులు ఈ పూల చెట్టును తమ సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసుకుంటూ సంబరపడుతున్నారు. ఇప్పుడా చెట్టు ఓ సెల్ఫీ పాయింట్‌గా మారింది! - యాచారం, జనవరి 28