Share News

గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jul 14 , 2024 | 11:51 PM

జిల్లా మధ్యనిషేధిత ఆబ్కారి అధికారి కె.విజయభాస్కర్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మిర్జాపూర్‌లో ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు.

గంజాయి పట్టివేత

పూడూరు, జూలై 14: జిల్లా మధ్యనిషేధిత ఆబ్కారి అధికారి కె.విజయభాస్కర్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మిర్జాపూర్‌లో ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. మిర్జాపూర్‌లో గంజాయి నిల్వలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం అందుకున్న జిల్లా ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహ్మద్‌ ఆసిఫ్‌ ఇంట్లో 300గ్రాముల ఎండు గంజాయి లభించిందని తెలిపారు. అనంతరం అట్టి వ్యక్తిని విచారించగా, అతడు ఇచ్చిన సమాచారం మేరకు చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన మొల్ల షేర్జా ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతడి వద్ద 300 గ్రాముల ఎండు గంజాయి లభించిందని, 150గ్రాముల గంజాయి విత్తనాలు లభించినట్లు వారు వివరించారు. ఈ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని టాస్క్‌ఫోర్స్‌ జిల్లా అధికారి కె.శ్రీనివాస్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ రెడ్డి, సిబ్బంది విష్ణువర్దన్‌రెడ్డి, హన్మంతు, శివప్రసాద్‌, రవికిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 11:51 PM